‘సిద్ధ’కే ప్రాధాన్యత ఇస్తున్న కొరటాల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

 Koratala Siva Gives Importance To Ram Charan, Koratala Siva, Acharya, Ram Charan-TeluguStop.com

కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కేమియో రోల్‌లో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలో సిద్ధ ఓ నక్సలైట్ అని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌లో మనకు చిత్ర యూనిట్ చూపించారు.అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్‌లో చరణ్ పాత్రకు సంబంధించిన పార్ట్ మాత్రమే మిగిలి ఉందని చిత్ర యూనిట్ అంటోంది.

దీంతో చరణ్‌కు సంబంధించిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నాడు./br>

చిరంజీవి పాత్ర కంటే కూడా చరణ్ పాత్రకే కొరటాల ప్రాధాన్యత ఇస్తున్నాడని చిత్ర వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

చరణ్ పాత్ర ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందని, అందుకే కొరటాల సిద్ధ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది.

ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి కొంతమే షూటింగ్ కూడా పూర్తి చేశారు.మరి ఆచార్య చిత్రంలో సిద్ధ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నాయి చిత్ర వర్గాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube