‘సిద్ధ’కే ప్రాధాన్యత ఇస్తున్న కొరటాల

‘సిద్ధ’కే ప్రాధాన్యత ఇస్తున్న కొరటాల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘సిద్ధ’కే ప్రాధాన్యత ఇస్తున్న కొరటాల

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

‘సిద్ధ’కే ప్రాధాన్యత ఇస్తున్న కొరటాల

కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కేమియో రోల్‌లో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాలో సిద్ధ ఓ నక్సలైట్ అని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌లో మనకు చిత్ర యూనిట్ చూపించారు.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్‌లో చరణ్ పాత్రకు సంబంధించిన పార్ట్ మాత్రమే మిగిలి ఉందని చిత్ర యూనిట్ అంటోంది.

దీంతో చరణ్‌కు సంబంధించిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నాడు.

/br చిరంజీవి పాత్ర కంటే కూడా చరణ్ పాత్రకే కొరటాల ప్రాధాన్యత ఇస్తున్నాడని చిత్ర వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది.

చరణ్ పాత్ర ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందని, అందుకే కొరటాల సిద్ధ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది.

ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి కొంతమే షూటింగ్ కూడా పూర్తి చేశారు.మరి ఆచార్య చిత్రంలో సిద్ధ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నాయి చిత్ర వర్గాలు.

హెచ్ 1 బీ దరఖాస్తుదారులకు అలర్ట్ .. ఇకపై అడ్రస్ , బయోమెట్రిక్స్ ఇవ్వాల్సిందే