తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగా డాక్టర్ నిహారిక ( Niharika Konidela )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ( Chaitanya Jonnalagadda ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.
నిహారికను పెళ్లి చేసుకోక ముందు వరకు కూడా చైతన్య ఎవరు అన్నది చాలామందికి తెలియదు.కానీ నిహారికను పెళ్లి చేసుకున్న తర్వాత విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు చైతన్య జొన్నలగడ్డ.
అయితే నిహారిక గురించి ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి మనందరికీ తెలిసిందే.కానీ చాలామందికి చైతన్య గురించి చైతన్య బ్యాగ్రౌండ్ గురించి సరిగా తెలియదు.
మరి చైతన్య జొన్నలగడ్డ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చైతన్య జొన్నలగడ్డ హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.ఆ తరువాత, రాజస్థాన్ లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గణితంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశాడు.ఆపై హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ పొందాడు.
ఇక కాలేజ్ డేస్‌లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్( Student Union Leader )గా కూడా పనిచేశాడు చైతన్య.బలమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు.ఆపై తన చదువు పూర్తయిన తర్వాత వివిధ సంస్థలలో ఇంటర్న్ షిప్ చేసి వ్యాపారరంగంలో మంచి అనుభవం సంపాదించాడు చైతన్య.కాగా చైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకరరావు( Jonnalagadda Prabhakara Rao ) పోలీసు అధికారి అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఆయన గుంటూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు.చైతన్య తాత వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ కూడా ఇన్‌స్పెక్టర్.చైతన్య తల్లి గృహిణి.అతనికి దీపిక అనే ఒక అక్క ఉంది.ఆమె తన భర్తతో కలిసి యూఎస్ఏ లో ఉంటోంది.కాగా చైతన్య జొన్నలగడ్డ నటి, నిర్మాత నిహారిక కొణిదెలను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా వీరి ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 13, 2020న జరిగగా, డిసెంబర్ 9, 2020న రాజస్థాన్ లోని ఉదయపూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.కాగా చైతన్య జొన్నలగడ్డ మొదట హైదరాబాద్‌లోని ప్రభుత్వ సలహా సంస్థ KPMGలో అసిస్టెంట్ మేనేజర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు.
GMR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఇంటర్న్‌గా కూడా పనిచేశాడు.ప్రాసెస్‌వీవర్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా పని కూడా చేశాడు.
అతను ప్రస్తుతం, టెక్ మహీంద్రా గ్రూప్‌లో జాబ్ చేస్తున్నాడు.అక్కడ ప్రొడక్ట్ ఓనర్ కమ్ మేనేజర్‌గా మంచి స్కిల్స్ చూపించి బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా ప్రమోషన్ పొందాడు.
నెస్లే, ఐబీఎమ్, ఎయిర్టెల్ తో పాటు అనేక ఇతర ప్రముఖ భారతీయ కంపెనీలలో అతడు పెట్టుబడి పెట్టాడు.ఇకపోతే చైతన్య జొన్నలగడ్డకు 3 మిలియన్ డాలర్ల వరకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.