స్టార్ హీరో విజయ్ భార్యతో విడాకులు తీసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వయస్సు 48 సంవత్సరాలు కాగా చూడటానికి మాత్రం ఈ స్టార్ హీరో చాలా యంగ్ గా కనిపిస్తారనే సంగతి తెలిసిందే.వారసుడు సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా 12వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్ 11వ తేదీకి మారింది.

 Thalapathy Vijay Wife Sangeetha Heading For Divorce Rumors Viral,thalapathy Vija-TeluguStop.com

విజయ్ అభిమానులు ఒకరోజు ముందుగానే ఈ సినిమాను థియేటర్లలో చూడబోతున్నారని సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుతున్నాయి.

అయితే గత కొన్నిరోజులుగా విజయ్ తన భార్యతో విడాకులు తీసుకోనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ వార్తలు విన్న నెటిజన్లు 48 సంవత్సరాల వయస్సులో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడం ఏంటనే ప్రశ్నలను వ్యక్తం చేశారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ఫేక్ వార్తలు అని సమాచారం.

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకు సంబంధించి తరచూ వార్తలు వైరల్ అవుతుండగా ఇప్పుడు కూడా అదే విధంగా విజయ్ గురించి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే వైరల్ అయిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సమాచారం.వారసుడు రిలీజ్ సమయంలో విజయ్ ఫ్యాన్స్ దృష్టి మరల్చడానికి కొంతమంది కావాలనే ఈ తరహా వార్తలను ప్రచారంలోకి తెస్తున్నారు.

విజయ్ భార్య సంగీత తన పిల్లలతో కలిసి అమెరికాలో ఉన్నారని విజయ్ సింగిల్ గా ప్రమోషన్స్ కు హాజరు కావడం వల్లే ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని సమాచారం అందుతోంది.

వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చెప్పలేం కానీ తమిళ ప్రేక్షకులకు మాత్రం నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.విజయ్ తర్వాత ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని ఒక్కో ప్రాజెక్ట్ కు విజయ్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది.

Hero Vijay and Wife Sangeetha Heading for Divorce

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube