టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం తేదీ ఇదే.. పెళ్లి ఎప్పుడంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన శర్వానంద్ పెళ్లికి సంబంధించి నిన్నటినుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం.

 Tollywood Star Hero Sharwanand Engagement Date Details,sharwanand,bojjala Gopala-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం బాలయ్య టాక్ షోలో ప్రభాస్ పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన శర్వానంద్ ఇప్పుడు మాత్రం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.ఈ నెల 26వ తేదీన శర్వానంద్ నిశ్చితార్థం జరగనుంది.

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి శర్వానంద్ అల్లుడు కానున్నారని సమాచారం అందుతోంది.ప్రముఖ సీనియర్ రాజకీయ నేతలలో ఒకరైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలితో శర్వానంద్ నిశ్చితార్థం జరగనుంది.గోపాలకృష్ణారెడ్డి కూతురి కూతురుతో శర్వానంద్ వివాహం జరగనుండగా ఈ ఏడాది సమ్మర్ లో వివాహం జరగనుందని సమాచారం అందుతోంది.నిశ్చితార్థ వేడుకకు పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరు కానున్నారని సమాచారం.

నిశ్చితార్థం సింపుల్ గా చేద్దామని పెళ్లి మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేద్దామని శర్వానంద్ కుటుంబ సభ్యులకు సూచించినట్టు సమాచారం అందుతోంది.నిశ్చితార్థ వేడుక నిర్వహించడానికి మరీ ఎక్కువగా హడావిడి చేయొద్దని శర్వానంద్ సూచనలు చేసినట్టు సమాచారం.

త్వరలో శర్వానంద్ అధికారికంగా తన పెళ్లికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారని సమాచారం అందుతోంది.

పెళ్లి గ్రాండ్ గా జరిగినా డెస్టినేషన్ మ్యారేజ్ గా జరగనుందని పెళ్లి వేడుకకు కూడా పరిమిత సంఖ్యలో బంధుమిత్రులు హాజరు కానున్నారని తెలుస్తోంది.గతేడాది ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న శర్వానంద్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

శర్వానంద్ వరుస ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకుంటే నటుడిగా ఆయన స్థాయి మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube