ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు కోహ్లీ దూరం..కోహ్లీ స్థానంలో ఊహించని ప్లేయర్..!

భారత్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్( England ) మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జనవరి 25న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.తొలి మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా.

 Kohli Absent From The First Two Test Matches With England Unexpected Player In K-TeluguStop.com

రెండవ మ్యాచ్ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా జరుగనుంది.

అయితే ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్లకు భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) దూరం అవ్వనున్నాడు.

విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలవల్ల తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉంటున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.మరి విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చే ప్లేయర్ ఎవరు బీసీసీఐ( BCCI ) ఇంకా ఎంపిక చేయలేదు.

కానీ విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులో చోటు పొందేందుకు ముగ్గురు ప్లేయర్లు పోటీపడుతున్నారు.రంజీల్లో అద్భుత ఆటను ప్రదర్శించిన ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాల్సి ఉంది.

ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

Telugu Bcci, England, Kohli, Rajat Patikar, Sarparaj, Matches, Virat Kohli-Sport

సర్పరాజ్: ( Sarparaj )ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్లలో సర్పరాజ్ వరుసగా 96,95 పరుగులు చేశాడు.గత మూడు రంజీ ట్రోఫీ ఎడిషన్లలో 154,122,91 సగటుతో, సర్పరాజ్ 2020 సంవత్సరం నుంచి దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు.ఇతనికి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడే భారత జట్టులో చోటుదకే అవకాశం ఉంది.

Telugu Bcci, England, Kohli, Rajat Patikar, Sarparaj, Matches, Virat Kohli-Sport

రజత్ పాటికార్: ( Rajat Patikar )ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన వార్మప్ మ్యాచ్లో వరుసగా 151, 111 పరుగులు చేశాడు.పేస్ మరియు స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో దిట్ట.

Telugu Bcci, England, Kohli, Rajat Patikar, Sarparaj, Matches, Virat Kohli-Sport

సుయాస్ ప్రభుదేశాయ్: ( Suyas Prabhudesai )గోవా కు చెందిన ఈ యువ ఆటగాడు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు.ప్రస్తుతం ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్లు ఆడి ఏకంగా 386 పరుగులు చేశాడు.ఇందులో రెండు సెంచరీలు ఉండడం విశేషం.భారత జట్టు మాజీ ప్లేయర్ పుజారా ఇటీవలే రంజీ ట్రోఫీలో జార్ఖండ్ పై డబల్ సెంచరీ సాధించాడు.కాబట్టి బీసీసీఐ సెలెక్టర్లు పుజారా కు మళ్లీ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube