తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు.
వివిధ రంగాల్లో అపారమైన తెలివి తేటలు ప్రదర్శిస్తున్నందుకు కేసీఆర్ కే నోబెల్ బహుమతులు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు.కరోనా చికిత్సకు పారాసెటమాల్ సరిపోతుందన్నందుకు వైద్య రంగంలో 80 వేల పుస్తకాలు చదివినందుకు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అయితే, తెలంగాణ రాష్ట్రానికి రావాలసిన నిధుల కేటాయింపులు, పొరుగు రాష్ట్రాలకు మోదీ కేటాయింపులపై తరుచూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న కేటీఆర్.తాజాగా మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదంటూ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే.