ఇటీవల కాలంలో చాలామంది నటీనటులు వారి పెళ్లి విషయాలను ప్రేమ విషయాలను ఎవరికి తెలియకుండా చాలా గోప్యంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.కానీ యంగ్ హీరో కిరణ్ అబ్బరవరం ( Kiran Abbavaram )దీనికి పూర్తి రివర్స్.
రీసెంట్ గా తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య( Rahasya )తో నిశ్చితార్థం చేసుకున్న ఈ హీరో, ఎట్టకేలకు తన లవ్ మేటర్ ను బయటపెట్టాడు.ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.
రాజావారు రాణిగారు సినిమా( Raja Vaaru Rani Gaaru ) నుంచే మేమిద్దరం కనెక్ట్ అయ్యాము.తను నా మైండ్ సెట్ కు దగ్గరగా ఉంది.
నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలా ఉంది రహస్య.నా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి తగ్గట్టుగా చాలా దగ్గరగా ఉంది.ఐదేళ్లుగా మేం రిలేషన్ షిప్ లో ఉన్నాము.నా వ్యక్తిగత విషయాల్ని కూడా బయటకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.నా క్లోజ్ సర్కిల్ కు మాత్రం తెలుసు.నిశ్చితార్థం కూడా ప్రైవేట్ గా చేసుకుందాం అనుకున్నాను, కానీ మీడియా అంతా కవర్ చేసింది.
రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ ఐ లవ్ యు చెప్పుకోలేదు.రిలేషన్ షిప్ మొదలుపెట్టిన ఏడాదిన్నర తర్వాత చెప్పుకున్నాము./br>
అది కూడా చాలా అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు అబ్బవరం.ప్రేమలో ఉన్నామని ఇద్దరికీ తెలుసని, కానీ ప్రపోజ్ చేసుకోవడానికి మాత్రం ఏడాదిన్నర పట్టిందని తెలిపారు.అప్పటికే ఇద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నట్టు తెలిపాడు.ఈ సందర్భంగా కిరణ్( Kiran Abbavaram ) చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.