తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విజయ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
తమిళనాడులో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడంతో పాటు అత్యధిక రెమ్యూనరేషన్ ని అందుకుంటున్న స్టార్స్ లో టాప్ ఫైవ్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్.అయితే మొదటి నుంచి హీరోగా రాణిస్తున్న విజయ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అందరూ భావించారు.
కానీ ఊహించని విధంగా రాజకీయ ప్రవేశం చేసి అభిమానులకు మరింత షాక్ ఇస్తున్నటునకు స్వస్తి చెప్పే పనిలో ఉన్నారు.ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.( The Greatest Of All Time ) వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.త్వరలో తాను నటించే 169వ చిత్రం ప్రారంభం కానుంది.ఈ చివరి చిత్రానికి ఆయన ఏకంగా రూ.250 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం అటుంచితే ఈయన తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారనే వార్త చాలా కాలంగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజానికి విజయ్‌కు తన తల్లి శోభ( Shobha ) అంటే చాలా ఇష్టం.ఎంతగా అంటే ఆమె కోసం ఆలయాన్ని కట్టించేంతగా! అవును విజయ్ తన తల్లి కోసం చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో( Korattur ) తన స్థలంలో సాయిబాబా గుడిని( Saibaba Temple ) కట్టించారనే ఒక వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఈ ఆలయ కుంభాభిషేకం కూడా గత ఫిబ్రవరి నెలలో నిర్వహించారట.
అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తల్లి కోసం తనకు ఇష్టమైన దేవుడిని గుడి కట్టించడం అన్నది చాలా గొప్ప విషయం అంటూ అభిమానులు ఆయనపై కామెంట్లో వర్షం కురిపించడంతోపాటు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.