నిర్మల్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది.కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
సదరు వ్యక్తి ఆర్ఎంపీ రవిగా గుర్తించారు.అయితే రవిని మహారాష్ట్ర కు చెందిన ఓ యువతి ప్రేమ పేరుతో ట్రాప్ చేసింది.
ఈ నేపథ్యంలో నాందేడ్ రావాలని పిలిచింది, అనంతరం యువకులతో రవిని కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు, సారంగాపూర్ మండలం వంజ్ గ్రామంలో కిడ్నాపర్లను పట్టుకున్నారు.