ఆ డైలాగ్ విని నా భర్తకు పడిపోయాను.. కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను కలిగి ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ( Kiara Advani ) ఒకరు.ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

 Kiara Advani Interesting Comments About Sidharth Malhotra Proposal Goes Viral In-TeluguStop.com

వచ్చే ఏడాది సెకండాఫ్ లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది.ఈ ఏడాది సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు.

తాజాగా కాఫీ విత్ కరణ్( Koffee With Karan ) షోలో పాల్గొన్న ఈ బ్యూటీ ఈ షోలో భాగంగా షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.భర్త సిద్దార్థ్ మల్హోత్రా( Sidharth Malhotra ) ప్రపోజ్ చేసిన విషయాలను కియారా గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సిద్దార్థ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఒకసారి రోమ్ టూర్ కు వెళ్లానని అక్కడ ఒకరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసిన తర్వాత రోమ్ వీధులలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Bollywood, Game Changer, Kiara Advani, Kiaraadvani, Koffee Karan-Movie

ఆ సమయంలో ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి వయోలిన్ ప్లే చేస్తూ పాట వినిపించాడని కియారా అద్వానీ అన్నారు.వెంటనే సిద్దార్థ్ మల్హోత్రా మోకళ్లపై కూర్చొని ఢిల్లీ కా సీదా సాదా లుండా హూ అనే డైలాగ్ చెప్పి ప్రపోజ్ చేశాడని పేర్కొన్నారు.తను అలా ప్రపోజ్( Propose ) చేయడంతో ఏదో తెలియని ఆనందం కలిగిందని ఆమె పేర్కొన్నారు.

వెంటనే ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని ఆమె అన్నారు.

Telugu Bollywood, Game Changer, Kiara Advani, Kiaraadvani, Koffee Karan-Movie

మా స్నేహితుడొకరు ఈ సంఘటనను వీడియో తీశారని కియారా అద్వానీ కామెంట్లు చేశారు.నా లైఫ్ లో చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం ఇదేనని ఆమె తెలిపారు.కియారా అద్వానీ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

కియారా అద్వానీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube