ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణనిచ్చే రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు అనుమతినిస్తూ ఉత్తర్వులిచ్చింది.అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దెభవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.