టీడీపీ నేత కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్ అవసరాల కోసం ముడా సంస్థను ఏర్పాటు చేశామన్నారు.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముడా సంస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
ఈ మేరకు తాజాగా ముడా అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో ఎన్నో తప్పులు దొర్లాయని కొల్లు రవీంద్ర తెలిపారు.
ప్రైవేట్ ఆస్తులను దోచుకునేలా మాస్టర్ ప్లాన్ తయారు చేశారని మండిపడ్డారు.మే 9 వ తేదీ వరకు అభ్యంతరాలకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్న ఆయన లోపభూయిష్టంగా ఉన్న మాస్టర్ ప్లాన్ పై ప్రజలు అభ్యంతరాలు తెలపాలని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ప్రజల పక్షాన పోరాండేందుకు టీడీపీ సిద్ధమని స్పష్టం చేశారు.