వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ పై వైఎస్ విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు.షర్మిల సిట్ కార్యాలయానికి వెళ్తే తప్పేంటన్న ఆమె షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని స్థితిలో పోలీసులు ఉన్నారని విజయమ్మ మండిపడ్డారు.షర్మిలను పదే పదే ఆపాల్సిన అవసరం ఏముందని నిలదీశారు.
తాను పోలీసులపై దాడి చేయలేదని చెప్పారు.పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆమె ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా అని అడిగారు.