ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ అడుగులు వేస్తున్నారు.మంచి జరిగి ఉంటేనే తనను గెలిపించాలని వైఎస్ జగన్( YS Jagan ) చెబుతుండగా ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది.
ఇదంతా కాసేపు పక్కన పెడితే…ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అసలు రంగు బయటపడిందంట.తనకు చెంచాగిరి చేయకపోయినా.
తన తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేయకపోయినా సొంతపార్టీ నేతలను సైతం ఉపేక్షించరని అర్థం అవుతుందని ఏపీ ప్రజలు అంటున్నారు.ఢిల్లీ పెద్దలతో రాయబారాలు చేయడం, చీకటి వ్యవహారాలు చేయడం లేదని రెండుసార్లు విజయాన్ని అందించిన కేశినేని నానిని ఇన్ డైరెక్ట్ గా బయటకు పంపినంత పని చేశారు.
పార్టీలో ఉండండి.కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.
పెద్దరికం చూపొద్దని అధినేత రాయబారం పంపారని స్వయంగా కేశినేని నానినే వెల్లడించిన సంగతి తెలిసిందే.

రేపు తిరువూరులో జరగనున్న చంద్రబాబు( Chandrababu naidu ) సభకు కేశినేని నాని బదులు ఆయన తమ్ముడు కేశినేని చిన్ని( Kesineni Chinni )ని ఇంఛార్జ్ గా నియమించారు.అంతేకాదు తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నానికి పార్టీ హైకమాండ్ కీలక ఆదేశాలు ఇచ్చింది.అయితే తిరువూరులో చంద్రబాబు సభ నేపథ్యంలో ఈ విషయాన్ని చర్చించేందుకు గానూ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఈ క్రమంలోనే జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.అయితే పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ఇంఛార్జ్ దేవదత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎంపీ నాని ఫొటో లేదని ఆయన వర్గీయులు నిరసనకు దిగారు.
తమను అవమాన పరచడానికే ఎంపీ కేశినేని నాని ఫొటోను పెట్టలేదని ఆరోపించారు.ఈ క్రమంలోనే నియోజకవర్గ ఇంఛార్జ్ పై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారని తెలుస్తోంది.
ఆ తరువాత పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన చిన్నిని సైతం కేశినేని నాని వర్గీయులు అడ్డుకున్నారు.దీంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.
కుర్చీలు విసురుకుంటూ పరస్పర దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు.

ఉద్రిక్తతలు ముగిసిన తరువాత కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి.అంతేకాదు తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరొకరిని ఇంఛార్జ్ గా నియమిస్తున్నట్లు అధిష్టానం తెలిపింది.ఈ క్రమంలోనే కేశినేని నాని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని అధినేత ఆదేశించారని పార్టీ నేతలు తెలిపారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ( Vijayawada MP )గా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి చంద్రబాబు పంపిన ఒక ప్రతినిధి బృందం తెలిపింది.
ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని ప్రజలకు తెలియపరిచారు.
టీడీపీ ఆదేశాలకు కేశినేని నాని ఘాటుగానే స్పందించారు.తాను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని చెప్పారు.తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన విజయాన్ని సాధించగలనని ప్రతిజ్ఞ చేశారు.
తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, అవి వస్తే ఇంకా గొప్ప స్థానంలో ఉండేవాడినని పేర్కొన్నారు.ఇక త్వరలోనే తన ఎంపీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.
లోక్ సభ స్పీకర్ ను కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తరువాత ముఖ్య అనుచరులతో సమావేశం అవుతానని తెలిపారు.అనుచరులు, అభిమానుల నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.
తాజాగా కేశినేని వ్యవహారంతో చంద్రబాబుపై ఏపీ ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.బెజవాడలో కేశినేని నానికి చెక్ పెట్టానని టీడీపీ భావిస్తున్నప్పటికీ.
బెజవాడలో టీడీపీకే ప్రజలు చెక్ పెడతారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.