అక్టోబరు 7న గాజా సరిహద్దుకు సమీపంలోని పట్టణాలపై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడి( Hamas attack ) ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సమయంలో ఒక భారతీయ యాత్రికుల బృందం ఇజ్రాయెల్‌లోనే ఉంది.
అక్కడినుంచి ఎలా బయటపడాలో తెలియక వాళ్ళు ఎంతో భయపడ్డారు.అలాంటి పరిస్థితులలో భారత రాయబార కార్యాలయం వారు యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని సురక్షితంగా కేరళకు తిరిగి రావడానికి సహాయం చేసింది.
యాత్రికులలో ఒకరైన మౌలవి( Moulavi ) మాట్లాడుతూ, దౌత్యకార్యాలయ అధికారులు తమకు సహాయం చేయడంలో చాలా త్వరగా, సమర్ధవంతంగా పనిచేశారని చెప్పారు.తిరుగు ప్రయాణంలో ఒక్కరోజు ఆలస్యమై ఉంటే వార్ జోన్‌లో చిక్కుకునేవారమని అన్నారు.
మౌలవి, అతని భార్య కేరళ నుండి తీర్థయాత్రకు ఇజ్రాయెల్ వెళ్ళిన 45 మంది సభ్యుల బృందంలో భాగం.పరిస్థితి తీవ్రత తమకు మొదట్లో అర్థం కాలేదని, అయితే క్షిపణుల శబ్ధాలు విని తమ చుట్టూ ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని చూసి భయాందోళనకు గురయ్యామని చెప్పారు.

అక్టోబరు 7న తమ తిరుగుప్రయాణం జరగాల్సి ఉందని, టూర్ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు బృందంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని మౌలవి తెలిపారు.అప్పుడే ఇజ్రాయెల్‌లో హమాస్ దాడి ప్రారంభించిందని, తమ ప్రయాణాన్ని ఆపివేసి, రోజంతా ఒకే చోట ఉండవలసి వచ్చిందని, అది చాలా భయానకంగా అనిపించిందని అన్నారు.ఎవరూ తమకు సహాయం చేయలేరని ఇక తమ జీవితం ఇక్కడితో ముగిసిపోతుందని అనుకున్నట్లు వెల్లడించారు.

మరుసటి రోజు ఉదయం, వారు తమ ప్రయాణాన్ని పునఃప్రారంభించి, తబా సరిహద్దు గుండా ఈజిప్టు( Egypt )లోకి ప్రవేశించగలిగారు.వారు ఇజ్రాయెల్ నుంచి బయటపడినందుకు ఊపిరి పీల్చుకున్నారు.క్షిపణి దాడులను దూరం నుంచి చూడగలుగుతున్నామని, భయంకరమైన శబ్ధం వినిపిస్తోందని మౌలవీ తెలిపారు.
వారు క్షేమంగా తిరిగి రావాలని సహకరించిన, ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా భారత రాయబార కార్యాలయ అధికారులకు, ఇంటికి చేరుకోవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.