సీఎం కెసిఆర్ ఉద్యమ నినాదం తో దూసుకు వచ్చి.రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించు కున్నాడు.
ఐతే ఇప్పుడు కొత్త ఫార్ములా తో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే ఏపీ లో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించి.
పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ చేశారు.అదే ఫార్మాట్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఢిల్లీ లలో పార్టీ కార్య కలాపాలు మొదలు పెట్టడానికి రెడీ అయ్యారు.
ఇప్పటి పంజాబ్, హర్యానా లలో పార్టీ రైతు వింగ్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది.
ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా కేడర్ ను స్టార్ట్ చేయాలి దానికోసం నికార్సైన నాయకులు కావాలి.
అసలు సీఎం కెసిఆర్ తనను తప్పా మిగిలిన నాయకులను నమ్మరు.అందులోనూ తన సొంత పార్టీ నేతలను కూడా పక్కన పెడతారు.అందుకే సీఎం కెసిఆర్ ఒక కొత్త స్ట్రాటజీ నీ ఫాలో కానున్నారని టాక్ నడుస్తోంది.ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశము గా పార్టీ నీ విబజ్జించి.
హైదరాబాద్ కేంద్రంగా.మంత్రి కేటీఆర్ దక్షిణాది రాజకీయాలపై ఫోకస్ చేస్తే.
ఢిల్లీ అడ్డాగా ఎమ్మెల్సీ కవిత ను ఉత్తరాది రాజకీయాలపై ఫోకస్ చేయించాలి అని చూస్తున్నారు.
ఇక జాతీయ పార్టీ అధ్యక్ష హోదాలో దేశం మొత్తం సుడిగాలి పర్యటనలు చేసి అన్ని రాష్ట్రాల్లో కేడర్ ను తన వైపు తిప్పుకుని ప్రయత్నాలు చేయనున్నారు.దానికోసం యాదవులు ఎక్కువగా ఉండే యూపీ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి యాదవ నేతలను ఇంచార్జీ గా పంపాలని, ముస్లిం లు అధికంగా ఉండే కాశ్మీర్ ప్రాంతానికి హోమ్ మంత్రి మహమూద్ అలీను ఇంచార్జీ గా పంపాలని చూస్తున్నారు.
ఇలా అక్కడక్కడ తెలంగాణ వాళ్ళను పంపి అయన బీ అర్ ఎస్ పార్టీ నీ విస్తరించాలి అని చూస్తున్నారు.ఇప్పటికే గుజరాత్ లో మాజీ ముఖ్యమంత్రి నీ పార్టీ లోకి ఆహ్వానించారు కూడా.అయితే అయన చేరికకు ఇంకొంచం సమయం పట్టే అవకాశం ఉంది.
మరి కెసిఆర్ మాస్టర్ స్కెచ్ కరెక్ట్ గా పనిచేస్తే అయన అనుకున్న ఫలితాలు సులభంగా వస్తాయి అని విశ్లేషకులు అంటున్నారు.
.