Mlc Kavitha Arrest : లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్… బీఆర్ఎస్ కు కలిసొచ్చేదెంత ? 

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita )ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది.నిన్న అనూహ్య పరిణామాల మధ్య ఈడి అధికారులు కవితను అరెస్టు చేశారు.

 Kavithas Arrest In Liquor Scam What Will Happen To Brs-TeluguStop.com

అరెస్టు సమయంలో ఈడి అధికారులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదనకు దిగారు.పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత అరెస్టు కావడం పార్టీలో కలకలమే రేపింది.

ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది.కీలక నాయకులు అనుకున్న చాలామంది కాంగ్రెస్ లో చేరిపోయారు.

ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగానే,  ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది.అయితే కవిత అరెస్టును బీఆర్ఎస్ ఏవిధంగా వాడుకుంటుంది,  ప్రజల్లో ఏవిధంగా సెంటిమెంటును రాజేసి రాజకీయంగా లబ్ధి పొందుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Telugu Brs Mlc Kavitha, Brs, Delhiliquor, Lok Sabha, Mlc Kavitha, Ts-Politics

 త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) బీఆర్ఎస్ కి కొన్నిచోట్ల అభ్యర్థులే లేరనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను ఇప్పటివరకు కేసీఆర్ ప్రకటించలేదు .ఈ సమయంలోనే కవిత అరెస్టు కావడం,  దీనిని తమకు అనుకూలంగా కేసీఆర్ ఏ విధంగా మార్చుకుంటారనేది చర్చనీయంశం గా మారింది.  2019 ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.

ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ గా ఓటమి చెందిన దగ్గర నుంచి కవిత అంతగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా  ఉండడం లేదు.

ఇటీవలే అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కవిత నిరసన చేపట్టారు.బిఆర్ఎస్ సమితి పేరుతో కాకుండా , భారత జాగృతి పేరు మీద ఆమె నిరసన కార్యక్రమం చేపట్టారు.

  దీంతో ఆమె పార్టీకి దూరం అవుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి.అయితే కవిత అరెస్టు ను బిఆర్ఎస్ ఏ విధంగా వాడుకాబోతోంది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

కవిత అరెస్టుపై జనాల్లో సానుభూతి ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.లిక్కర్ స్కాం జరిగిందని ఎప్పటి నుంచో ఈడి అధికారులు చెబుతున్నారు.

దీంట్లో కవిత పాత్ర కీలకమని అధికారులు కొన్ని ఆధారాలను బయటపెట్టారు.

Telugu Brs Mlc Kavitha, Brs, Delhiliquor, Lok Sabha, Mlc Kavitha, Ts-Politics

 అయితే తాను లిక్కర్ స్కాం( Delhi liquor scam ) లో పాల్గొనలేదని ధైర్యంగా కవిత చెప్పలేకపోవడం , కవితకు ఈ స్కాం వ్యవహారంలో డబ్బులు ఇచ్చానని సుకేష్ చంద్రశేఖర్ కొంతకాలం క్రితం ఆరోపణలు చేయడం,  జైలు నుంచే లేఖలు రాయడం ఇవన్నీ కవితకు ఇబ్బందికరంగానే మారాయి.జనాల్లోనూ కవిత ఈ స్కాం లో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో,  కవిత అరెస్టు తో సెంటిమెంటును రగిలించే అవకాశం బి ఆర్ ఎస్ కు అంతంత మాత్రం గానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube