ప్రస్తుతం దేశంలో కరుణ వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో ఎక్కడ జనాలు అక్కడే వారి ఇళ్ల పరిధిలో పరిమితమయ్యారు.
దీంతో ఇళ్లల్లో పనులు చేసే కొందరు కూడా ఇంటి పనులకు వెళ్లడం మానేశారు.దీంతో కొందరు ప్రముఖులు బాగానే ఇబ్బందులు పడుతున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ విషయానికి సంబంధించి ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.అయితే ఇందులో కత్రినా కైఫ్ వంట చేయడానికి ఉపయోగించే టువంటి వంట పాత్రలను శుభ్రం చేస్తూ కనిపించింది.
అంతే గాక ప్రస్తుతం లాక్ డౌన్ ఉండడంతో ఇంట్లో పని చేసినటువంటి పని మనుషులు కూడా రావడం లేదని తెలిపింది.అయితే కరోనా వైరస్ వల్ల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అంతేగాక ఈ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలిపింది.