తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు చిరంజీవి… ప్రస్తుతం చిరంజీవి విశ్వం భర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆయన చాలా రకాలుగా కష్టపడుతున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంభందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఏంటి అంటే ఈ సినిమాలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో.నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఆయన ఎవరు అంటే ఉపేంద్ర( Upendra Rao ) అని తెలుస్తుంది.ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఇప్పటికే ఉపేంద్ర హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల సినిమాల్లో నటించాడు.ఇక తెలుగులో ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఈ మధ్య కొద్ది రోజుల నుంచి తెలుగు సినిమాలకి గ్యాప్ ఇస్తూ వస్తున్న ఉపేంద్ర ఇప్పుడు విశ్వంభర సినిమాతో మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఉపేంద్ర క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉంటుందట.
ఇక దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ వశిష్ట( Mallidi Vasishta ) కూడా ఆయన క్యారెక్టర్ ని చాలా చక్కగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈయనది పాజిటివ్ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టరా అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికైతే సినిమా యూనిట్ ఎక్కడ కూడా వెల్లడించడం లేదు.ఇక మొత్తానికైతే చిరంజీవి సినిమాకి అదనపు ఆకర్షణలు బాగానే ఆడ్ అవుతున్నాయనే చెప్పాలి.ఇక ఉపేంద్ర రాకతో కన్నడలో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుందనే ఆశ భవాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తుంది…