ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను నియమించిన వారినే సోము వీర్రాజు తొలగిస్తున్నారని ఆరోపించారు.అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని చెప్పారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా తను ఎంతోమందిని పార్టీలో చేర్పించానన్న కన్నా ఇప్పుడు వాళ్లంతా పార్టీని వీడుతున్నారని తెలిపారు.ఈ విషయంపై సోమువీర్రాజు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమువీర్రాజు వియ్యంకుడు బీఆర్ఎస్ లో చేరడంపై ఏమంటారని ప్రశ్నించారు.పవన్, బండి సంజయ్ లను వీక్ చేసే కుట్ర జరుగుతుందన్న ఆయన పవన్ కు అండగా ఉంటానని స్పష్టం చేశారు.