కంగనా( Kangana Ranaut ) పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి ఈమె తనకు సంబంధించిన ఏ విషయం అయినా నిర్మొహమాటంగా అందరితో పంచుకుంటారు.అయితే సినిమా ఇండస్ట్రీలోనూ అలాగే రాజకీయ నాయకుల పట్ల కూడా ఈమె స్పందిస్తూ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా తెలియజేస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు.
ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలకే పరిమితమైనటువంటి ఈమె ప్రస్తుతం తమిళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కంగనా నటించిన చంద్రముఖి 2 ( Chandramukhi 2 ) సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే ఈమెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తన సినిమాల గురించి కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడి( Social media )యాలో అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ కంగనా సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.ఎన్నో బ్లాక్ బస్టర్ అయినటువంటి తన సినిమాలు డిజాస్టర్ గా కొందరు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
150 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాలను కూడా ఫ్లాప్ సినిమాలుగా చిత్రీకరిస్తున్నారని,తనకు వ్యతిరేకంగా కొందరు డబ్బులు ఇచ్చి ఇలాంటి ప్రచారాలను చేయిస్తున్నారని దీని వెనుక పెద్ద మాఫియా ఉందని ఈమె ఆరోపణలు చేశారు.ఇలాంటి అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఆత్మ శాంతించాలని ఈమె కోరుకున్నారు.అదేవిధంగా నా గురించి ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కోసం రాత్రి పగలు ఆలోచిస్తూ సమయం డబ్బును వృధా చేసుకోకండి అంటూ ఈమె చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.