ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన కాజల్ అగర్వాల్.. ఏకంగా పబ్లిక్ లో భర్తకు లిప్ కిస్ ఇస్తూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ముద్దుగుమ్మ కాజల్ పరిచయం గురించి అవసరమే లేదని చెప్పవచ్చు.అతి తక్కువ సమయంలో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Kajal Aggarwal, Who Made Fans Hot Break Giving Lip Kiss To Her Husband In Public-TeluguStop.com

తన నటనతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.టాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంటూ ఓ వెలుగు వెలుగుతుంది.

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కాజల్.ఆ తరువాత మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటించింది.ఇక ఈమెకు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ.

తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది.

చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లు తో కొంతకాలం రిలేషన్షిప్ లో ఉండి.అతడిని పెళ్లి చేసుకుంది.అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.

ఇక ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది.ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.బేబీ పుట్టాక కూడా కాజల్ అందంలో ఎటువంటి మార్పు లేదు.

పైగా మునిపటి రూపం సంపాదించుకోవడం కోసం వర్కౌట్లు కూడా చేసింది.అంతేకాకుండా సినిమాలలో అవకాశాలు రావటంతో కూడా సైన్ చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఇంకా యాక్టివ్ గా మారింది.తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా బాగా ఫోటో షూట్ లు చేయించుకున్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు కూడా బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ బాగా సందడి చేస్తుంది.తన కొడుకుతో దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.ఇక తన భర్తతో గడిపిన క్షణాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక కాజల్ కు పెళ్లి అవ్వడంతో తన అభిమానులు మాత్రం అస్సలు తట్టుకోలేకపోయారు.

ఎందుకంటే తమ అభిమాని హీరోయిన్ గా కాజల్ ను ఊహించుకున్నారు కాబట్టి.ఇక ఇప్పటికీ కూడా ఆమె షేర్ చేసుకునే ఫోటోలను చూస్తే తట్టుకోలేకపోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఫోటో షేర్ చేసుకుంది కాజల్ అగర్వాల్.

అందులో పబ్లిక్ లో కాజల్ తన భర్తతో, బాబుతో కలిసి ఫోటో దిగాక అందులో కాజల్ తన భర్తకు లిప్ కిస్ ఇస్తూ కనిపించింది.ఇక ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు.హాట్   బ్రేక్ అయ్యింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.ఇక కాజల్ ఇటీవలే ఓ సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube