ఆ ప్రాంతంలో నాలుక‌ను బ‌య‌టకు చూపిస్తే అది వెక్కిరింత కాదు... మ‌రేమిటంటే...

ప్రపంచంలోని ప్రతి దేశానికి దానికే సొంతమైన ప్రత్యేక సంస్కృతి, ఆలోచనలు ఉంటాయి.ప్రతిచోటా ప్రజలకు వారివారి అలవాట్లు ఉంటాయి.

 Sticking Out The Tongue In That Area Is Not Sarcastic Details, Sticking Out The-TeluguStop.com

ఇంటికి వచ్చిన అతిథులను అందరూ తమదైన శైలిలో గౌరవిస్తారు.మన దేశానికి అతిథి వస్తే ముకుళిత హస్తాలతో ‘నమస్తే’ అంటాం.

కొన్ని చోట్ల నమస్కరించే సంప్రదాయం కూడా ఉంది.కొన్ని చోట్ల చేతులు పైకెత్తి హలో అంటారు.

అయితే అతిథులను పలకరించే విధానం చాలామందికి ఇబ్బందికరంగా అనిపించే అనేక ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి.అవును.

అతిథులను తమ నాలుకను చూపించి, వారిని వాసన చూసి స్వాగతం పలికి గౌరవించే సంప్రదాయం ప్రపంచంలో ఒకచోట ఉంది.ఇప్పుడు ఈ విచిత్ర ఆచారానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

టిబెట్‌లో ప్రత్యేకమైన స్వాగత సంప్రదాయం

మీరు ఎప్పుడైనా టిబెట్‌కు వెళితే, అక్కడ ఎవరైనా తమ నాలుకను బయటపెట్టి మీకు చూపిస్తే, మిమ్మల్ని ఆటపట్టించడానికి అలా చేస్తున్నారని ఎంతమాత్రం అనుకోకండి.ఎందుకంటే, ఇక్కడ నాలుకను చూపించి స్వాగతం పలికి గౌరవించే విచిత్ర సంప్రదాయం ఉంది.ఇక్కడ ఈ విధమైన స్వాగతించే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది.

చరిత్రతే ముడిపడి సంప్రదాయం

Telugu China, France, Namasthe, Sarcastic, Shake Hand, Tongue, Tibet, Types, Ukr

పూర్వకాలంలో అంటే 9వ శతాబ్దంలో టిబెట్‌ను క్రూరమైన రాజు లాంగ్‌దర్మా పరిపాలించాడు.అతని నాలుక నల్లగా ఉండేదట.అప్పుడు టిబెటన్ ప్రజలు తమ నాలుకను బయటపెట్టి, తమను కలిసిన ఎవరితోనైనా ఆ రాజుతో తమకు సంబంధం లేదని చెప్పేవారట.టిబెట్‌లో నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

వాసనతో స్వాగతం

Telugu China, France, Namasthe, Sarcastic, Shake Hand, Tongue, Tibet, Types, Ukr

ఆ దేశం సముద్ర తీరంలో ఉంది.సోగి అని పిలిచే ఈ అందమైన దేశంలో అతిథులను ఆహ్వానించడానికి చాలా ప్రత్యేకమైన విధానం ఉంది.అతిథి ముఖాన్ని టవలుతో నొక్కడం, అతని నుంచి వచ్చే సువాసనను అనుభూతి చెందడానికి గాఢంగా పీల్చడం ఇక్కడ ప్రత్యేక సంప్రదాయం.

ప్రపంచవ్యాప్తంగా ఇతరులను స్వాగతించే, గౌరవించే, పలుకరించే మార్గాలు కూడా భిన్నంగా ఉంటాయి.మన దేశంలో చేతులు జోడించి నమస్కరిస్తారు.అదేవిధంగా తల వంచడాన్ని పాకిస్థాన్‌లో అదాబ్ అని అంటారు.గ్రీన్‌ల్యాండ్ దేశంలో అతిథులకు ముక్కులను తాకించడం ద్వారా స్వాగతం పలుకుతారు.

ఫ్రాన్స్, ఉక్రెయిన్‌లలో ప్రజలను పలకరించడం, వారి చెంపపై ముద్దు పెట్టుకోవడం ఆచారం.ఏది ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా షేక్ హ్యాండ్ ద్వారా గౌరవించడం, స్వాగతించడం అనేది అత్యంత ఆదరణ పొందింది.

ప్రపంచ వేడుకల్లో సైతం చాలా మంది కరచాలనం చేస్తూ స్వాగతం పలుకుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube