అమెరికాలో హరికేన్ ఇడా భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.తుఫాను వల్ల సంభవించిన వరదలు, టోర్నడోల ధాటికి 45 మంది చనిపోయినట్లు అంచనా.
చాలా మంది ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడం తప్పించుకునే వీలులేక మునిగి మరణించారు.ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీలలో నష్టం భారీగా సంభవించింది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి తుఫాను నష్టాన్ని అంచనా వేయనున్నారు.ఈ మేరకు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
వచ్చే మంగళవారం ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన పర్యటన వుంటుందని తెలిపింది.
ఇప్పటికే వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఆగ్నేయ రాష్ట్రం లూసియానాను బైడెన్ ఈ శుక్రవారం సందర్శించారు.
ఇక్కడి న్యూఓర్లీన్స్ నగరం హరికేన్ ప్రభావం వల్ల ఇంకా అంధకారంలోనే వుంది.ఈ సందర్భంగా వరదలతో అతలాకుతలమై దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన ప్రజలకు జో బైడెన్ ధైర్యాన్నిచ్చారు.
మీ అందరికీ అండగా మేమున్నాం అంటూ ఆయన హామీ ఇచ్చారు.దేశంలోని ప్రతి ఒక్కరు వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలపై ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలని, తీవ్రమైన తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులను నియంత్రించేందుకు సహకారం అందించాలని బైడెన్ సూచించారు.
వరద బాధితులందరినీ ఆదుకుంటామని .ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.

బైడెన్ పరిపాలనా యంత్రాంగం సమాచారం ప్రకారం.అధ్యక్షుడు న్యూయార్క్‌లోని క్వీన్స్‌బరోను సందర్శిస్తారు.కుండపోత వర్షాల కారణంగా అక్కడి బేస్‌మెంట్ అపార్ట్‌మెంట్లు మునిగిపోవడంతో చాలా మంది మరణించారు.తుఫాను వల్ల సంభవించిన వరదలు, టోర్నడోల ధాటికి న్యూయార్క్, న్యూజెర్సీలలో 45 మంది చనిపోయినట్లు అంచనా.
చాలా మంది ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడం తప్పించుకునే వీలులేక మునిగి మరణించారు.న్యూజెర్సీలో 23 మంది మరణించగా.న్యూయార్క్లో 13 మంది చనిపోయారు.అందులో 11 మంది ఇంటి బేస్మెంట్లోనే వరదలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పెన్సిల్వేనియాలో ఐదుగురు, వెస్ట్చెస్టర్లో ముగ్గురు , మేరీలాండ్లో ఒకరు మృతిచెందారు.