2019లో అంబానీ సంప‌ద ఎంత పెరిగిందో తెలుసా?

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయెన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ 2019లో తన సంపదను భారీగా పెంచుకున్నారు.బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.

 Jio Anil Ambani Mukesh Ambani Asserts-TeluguStop.com

ఈ ఏడాది ఆసియాలోనే అందరి కన్నా ఎక్కువ సంపదను ముకేష్‌ పోగేసుకున్నారు.

డిసెంబర్‌ 23వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ ఏడాది ముకేష్‌ అంబానీ సంపద 1700 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.21 లక్షల కోట్లు) పెరగడం విశేషం.దీంతో కలిపి ముకేష్‌ మొత్తం సంపద విలువ 6100 కోట్ల డాలర్లు (సుమారు రూ.4.35 లక్షల కోట్లు)కు చేరింది.ఇదే సమయంలో అలీబాబా ఫౌండర్‌ జాక్‌ మా సంపద 1130 కోట్ల డాలర్లు పెరగగా.

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాత్రం తన సంపదలో 1320 కోట్ల డాలర్లు నష్టపోయారు.

Telugu Ambani, Anil Ambani, Mukesh Ambani-

ఈ ఏడాది రిలయెన్స్‌ షేర్ల విలువ 40 శాతం పెరగడంతో ముకేష్‌ అంబానీ తన సంపదను మరింత పెంచుకున్నారు.ఇంత వరకూ కేవలం ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌లోనే భారీగా సంపాదించిన అంబానీ.క్రమంగా టెలి కమ్యూనికేషన్స్‌, రిటెయిల్‌ బిజినెస్‌లోనూ భారీ లాభాలు ఆర్జించనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఊహించని రీతిలో జియోపై 5 వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిన ముకేష్‌.దాని నుంచి భారీగా లబ్ధి పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube