నిష్కారణంగా సెల్ ఫోన్ కు రెండు ప్రాణాలు బలి...

ప్రయాణించే సమయంలో ఫోన్ వాడకం ప్రమాదమని ప్రభుత్వం వారు చెబుతున్న ప్రయాణికులు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీంతో ఈరోజు గుంటూరు ప్రాంతంలో సెల్ ఫోన్ కారణంగా ఇద్దరు ప్రయాణికులు స్పాట్లోనే మృతిచెందగా  మరో ఆరుగురు గాయాల పాలైన ఘటన గుంటూరు పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది.

 Guntur Auto Cellphone-TeluguStop.com

వివరాల్లోకి వెళితే గుంటూరు నుంచి తాడికొండ వెళ్లే రహదారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో ఆటో వెళుతోంది. అయితే ఆటోలో ముందు వైపు కూర్చున్నటువంటి ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ ని ఆటో హ్యాండిల్ భాగం దగ్గర ఉంచాడు.

 అయితే ఈ క్రమంలో డిల్లీ పబ్లిక్ స్కూల్ వద్దకు రాగానే ఫోన్ రింగ్ అవడంతో ఆ వ్యక్తి ఫోన్ తీసుకునే క్రమంలో అతడి చేతులు డ్రైవర్ మొఖానికి అడ్డురావడంతో డ్రైవర్ కి ముందు వైపు ఉన్నటువంటి రోడ్డు కనిపించక అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టుకి ఆటో ఢీ కొట్టింది.
 

Telugu Cell Phone, Guntur, Guntur Latest, Auto, Auto Guntur-Telugu Crime News(

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరు మందికి బలంగానే గాయాలైనట్లు తెలుస్తోంది.దీంతో ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో మృతి చెందిన వివరాలు మరియు గాయ పడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube