మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఒకే చెప్పిన స్వీటీ అనుష్క

టాలీవుడ్ లో అరుందతిగా, దేవసేనగా ప్రేక్షకులకి దగ్గరై తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి.కెరియర్ తొలినాళ్ళలో అనుష్కకి అరుందతి సినిమా ఒక్కసారిగా క్రేజ్ అమాంతం పెంచేసింది.

 Anushka Shetty Female Oriented-TeluguStop.com

ఆ సినిమా తర్వాత అనుష్క వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.ఇక ఆమె కెరియర్ లో చేసిన బాహుబలి సినిమా మరో ఎత్తు.

ఈ సినిమా ఆమెని స్టార్ నుంచి లేడీ సూపర్ స్టార్ గా మార్చేసింది.దేవసేన పాత్ర ద్వారా బాహుబలి లో ప్రభాస్ కి ఏ రేంజ్ లో ఇమేజ్ వచ్చిందో అదే రేంజ్ లో అనుష్కకి కూడా వచ్చింది.

ఆ ఇమేజ్ కారణంగానే బాహుబలి తర్వాత సోలోగా చేసిన బాగమతి సినిమా ఏకంగా ఆమె స్టామినాతో ఎబ్భై కోట్లు కలెక్ట్ చేసింది.

ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం ఇండో-అమెరికన్ మూవీ అయిన నిశ్శబ్దం సినిమాలో నటిస్తుంది.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ కాస్టింగ్ తో పాటు మాధవన్ లాంటి కీలక నటులు నటిస్తున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర గా యూఎస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అనుష్క మళ్ళీ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

క్లాసికల్ చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం తమిళ, తెలుగులో తెరకేక్కబోయే సినిమాలో నటించడానికి ఒకే చెప్పింది.ఈ సినిమా జనవరిలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube