జనసేన పార్టీ రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.గతంతో పోల్చితే ఆ పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తించేలా పవన్ వేస్తున్న అడుగులు బాగానే సక్సెస్ అవుతున్నాయి.
పార్టీలో ఇప్పుడు ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.పవన్ ఇదే దూకుడుతో ముందుకు వెళ్తే ఆ పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నటుంది అనే నమ్మకం కూడా అందరిలోనూ కలుగుతోంది.
ఇక జనసేనలో పవన్ తరువాత ఆ స్థాయిలో చరిష్మా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ మాత్రమే.అయన నీతి నిజాయితీపరుడు అనే అభిప్రాయం రాష్ట్రమంతా ఉంది.
ఇక ఎన్నికల ముందు జేడీ ఏ పార్టీలో చేరుతారో అనే అనేక ఉత్కంఠత అందరిలోనూ నెలకొనగా ఆయన ఎన్నికల సమయం దగ్గరలో జనసేనలో చేరారు.అక్కడ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.

జేడీ ఓటమి దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.తన పని ఏదో తనకు చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు.ఆయన విశాఖలోనే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల్లో ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.జనసేన ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవడం, జేడీ లక్ష్మీనారాయణ కు పార్టీలో ఎలాంటి పదవి పవన్ కల్యాణ్ ఇవ్వకపోవడంతో ఆయన మౌనంగా ఉంటూ వస్తున్నారు.
ఆయన ఒక దశలో పార్టీని వీడుతున్నారన్న ప్రచారం కూడా జరిగింది.పవన్ కల్యాణ్ నిర్ణయాల పట్ల జేడీ లక్ష్మీనారాయణ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది.

లక్ష్మీ నారాయణ బీజేపీలో చేరుతున్నారని, ఆయనకు ఏపీ బీజేపీలో కీలక పదవి దక్కబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఇక జేడీ వ్యవహారం కూడా అదేవిధంగా ఉంటూ వచ్చింది.సరిగ్గా ఇదే సమయంలో జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ లో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొనడమే కాకుండా ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు.ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో ఉత్తరాంధ్ర బాధ్యతలను మాత్రమే చూస్తున్నారు.
ప్రస్తుతం జనసేన పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడంతో జేడీ కూడా మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.అలాగే పవన్ కూడా లక్ష్మీ నారాయణకు కీలక పదవి ఇచ్చి ఆయన చరిష్మాను వాడుకోవాలని చూస్తోంది.