అనారోగ్యం తో బాధపడుతున్న ప్రధాని రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఏ దేశ ప్రధాని? ఎవరు? అని ఆలోచిస్తున్నారా.ఆయనే జపాన్ ప్రధాని షింజో అబే.ఆయన దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నారని అందుకే ఈ క్రమంలో ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది.
అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.ఆయన దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదు అన్న ఉద్దేశ్యం తో ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
జపాన్ ప్రధాని షింజో అబే కొద్దీ కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.ఆయనకు దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల వల్ల ఇటీవల ఆయన టోక్యో లోని ఒక ఆసుపత్రిలో దాదాపు ఏడు గంటల పాటు వైద్య పరీక్షలు కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన పై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది.ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో ప్రధాని అబే కు ఏడు గంటల పాటు పరీక్షలు నిర్వహించడం చర్చనీయాంశం గా మారింది.
అయితే ఆయన కు ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అబే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.అత్యధిక కాలం జపాన్ ప్రధాని గా అబే రికార్డ్ కూడా నెలకొల్పారు.
అయితే దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఈ పదవి నుంచి తప్పుకొని ప్రస్తుత ఉప ప్రధాని తారో అసో ను తాత్కాలిక భాద్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది అంటూ కథనాలు వస్తున్నాయి.అయితే దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల కానప్పటికీ ప్రస్తుతం మాత్రం జపాన్ రాజకీయాల్లో ఈ వార్త ఒక చర్చనీయాంశంగా మారింది.