ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించడానికే మూడు రాజధానుల నాటకానికి తెర లేపారని విమర్శించారు.రాజధాని అంశం కోర్టులో ఉన్న సమయంలో సెప్టెంబర్ నుంచే వైజాగ్ లో పాలన అని సీఎం జగన్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికే జగన్ ఇలాంటి ప్రకటన చేశారన్నారు.వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందన్న అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమని స్పష్టం చేశారు.