ఏపీలో ఓ కొలిక్కి రాని చర్చ ఏదైనా ఉందా అంటే అది రాజధాని అంశమే అని చెప్పాలి.రాష్ట్రం విడిపోయి పదేళ్ళు కావొస్తున్నా ఇప్పటివరకు ఏపీకి స్థిర రాజధాని లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణకు హైదారాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టల్లో పేర్కొనడం జరిగింది.ఇక 2014 ఏపీ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు రాజధానిపై గట్టిగానే దృష్టి పెట్టి అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం చేపట్టారు.
దాంతో గత ప్రభుత్వం అమరావతినే రాజధానిగా పరిగణించి అక్కడ వేగంగా అభివృద్ది పనులను ప్రారంభించిది.
కానీ 2019 ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడం, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ అమరావతి కాదని, మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం అది కూడా ఆచరణలోకి రాకపోవడంతో ఇప్పటికీ రాజధానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజధాని మార్పు చేసి తీరుతామని చెబుతున్నా వైసీపీ సర్కార్. ఇప్పుడు విశాఖ కేంద్రంగా రాజధాని మార్పు చేసేందుకు రెడీ అవుతోంది.
ఆ మద్య దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పినప్పటికి నిర్మాణ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో డిసెంబర్ నాటికి పోస్ట్ పోన్ చేశారు.

ఇక డిసెంబర్ కచ్చితంగా వైఎస్ జగన్ విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తారని వైసీపీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.అయితే ఆల్రెడీ అభివృద్ది అయిన విశాఖ నగరానికి రాజధాని మార్చి ఇప్పుడు కొత్తగా ఏం అభివృద్ది చేస్తారనే ప్రశ్న జగన్ సర్కార్ చుట్టూ తిరుగుతోంది.దీంతో గత ప్రభుత్వం మీద కక్ష పూరిత వైఖరి కారణంగానే జగన్ విశాఖకు రాజధాని షిఫ్ట్ చేస్తున్నారే తప్పా అభివృద్ది కోసం కాదనే అభిప్రాయం చాలమందిలో వ్యక్తమౌతోంది.
ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో వైసీపీని గట్టిగానే దెబ్బ తీసే అవకాశం ఉంది.అందుకే రాజధాని మార్పు విషయంలో జగన్ పునః ఆలోచన చేయాలా ? లేదా మార్పు చేయాలా ? అనే డైలమాలో ఉన్నారట.మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే డిసెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే.