మార్గదర్శి పై సిబిఐ దాడి చంద్రబాబు లక్ష్యంగా నేనా??

Jagan Master Plan Behind Ramoji Issue Details, Jagan, Ramoji Rao, Margadarshi Chits, Ap Cid, Chandrababu Naidu, Undavalli Arun Kumar, Ap Govt, Margadarshi, Cm Jagan Mohan Reddy, Tdp, Ycp

మీడియా మొగల్ గా దేశవ్యాప్తంగా సుపరిచితులు అయిన రామోజీరావు పేరు( Ramoji Rao ) తెలియని మనిషి ఉండడు .మార్గదర్శి, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, ఈటీవీ , ఇలా అనేక రంగాలలో మేరు నగదీరుడుగా పేరుగాంచి, వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా రామోజీరావు కి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.

 Jagan Master Plan Behind Ramoji Issue Details, Jagan, Ramoji Rao, Margadarshi Ch-TeluguStop.com

తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రాజకీయనాయకుడైనా ఆయన గుమ్మం ఎక్కాలే తప్ప, ఆయన తన ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్లిన చరిత్ర లేదు,తనకు కావలసిన పనులను ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా సాదించుకునే నేర్పు రామోజీ సొంతం ….అలాంటి రామోజీరావుకి కీలకమైన ఆయువు పట్టు అయిన మార్గ దర్శి పై( Margadarshi ) గురి గురు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Telugu Ap Cid, Ap, Chandrababu, Cmjagan, Jagan, Margadarshi, Ramoji Rao, Undaval

మార్గదర్శి లో జరుగుతున్న అవకతవకలపై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తూ ఉన్నాయి .ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ప్రెస్ మీట్ లు పెట్టి మరీ వివరించేవారు ….కోర్టులకు కూడా వెళ్లినా రామోజీ అనుకూల ప్రభుత్వాలు ఉండడం తో చెప్పుకోదగ్గ పరిణామాలు జరగలేదు.ఇప్పుడు జగన్ ప్రభుత్వం( CM Jagan ) ఎంటర్ అవ్వడంతో సంచలనాత్మకమైన పరిణామాలు ఈ కేసు విషయంలో జరుగుతున్నాయి.

మార్గదర్శికి సంబంధించిన 693 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ సిఐడి అటాచ్ చేసింది.ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది.ఆంధ్రప్రదేశ్లో 37 శాఖల ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్న మార్గదర్శికి 1989 చిట్ గ్రూపులు ఉన్నాయని, అయితే వీటన్నిటికీ సంబంధించిన నిధులను హైదరాబాదులోని సెంట్రల్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పడుతున్నారని, ఇది చిట్ఫండ్ చట్టానికి విరుద్ధమని, అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా అనేక వ్యవహారాలు జరుగుతున్నందున ఖాతాదారుల ప్రయోజనాల కోసం ఈ ఆస్తులను అటాచ్ చేసామని సిఐడి బృందం చెబుతుంది.

Telugu Ap Cid, Ap, Chandrababu, Cmjagan, Jagan, Margadarshi, Ramoji Rao, Undaval

తెలుగుదేశంతో ఆర్థిక మూలాలు కూడా పెనవేసుకున్న రామోజీరావుని టార్గెట్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి నిధులు కొరత ఉండేలా చూడాలన్న మాస్టర్ ప్లాన్ కూడా ఈ వ్యూహంలో భాగంగానే ఉందని, అందుకే మీడియా సపోర్ట్ తో పాటు ఆర్థికమైన సహాయం కూడా చేస్తుందన్న ఆరోపణలతోనే రామోజీ వ్యాపారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని విశ్లేషణలు వస్తున్నాయి .ఎన్ని ప్రభుత్వాలు మారినా తనకు తిరుగులేని నేతగా తన హవా నడిపించిన రామోజీరావు ఇప్పుడు జగన్ ప్రభుత్వ తీరుతో దిక్కుతోచని పడ్డారని ,అవసాన దశలో ఈయనకు ఇది అతి పెద్ద ఎదురుదెబ్బ అని అంటున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube