ఏపీలో స్కామ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.గత ప్రభుత్వ హయంలో జరిగిన కొన్ని స్కామ్ ల విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే జైలు పాలు అయ్యారు.
స్కిల్ స్కామ్ లో భాగంగా ఆయన జైల్లో ఉండగా, ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి రింగ్ రోడ్ స్కామ్.ఇలా ఇంకా పలు స్కామ్ లు ప్రాసస్ లో ఉన్నాయి.
కాగా ఇప్పుడెలా అయితే చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) స్కామ్ లను ఎదుర్కొంటున్నారో అదే విధంగా ఎన్నికల తరువాత జగన్ కూడా ఎదుర్కోవాల్సిందేనా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఎందుకంటే సంక్షేమమే ధ్యేయంగా జగన్ అమలు చేస్తున్న ఎన్నో పథకాలు నగదు కు సంబంధించినవే.అమ్మవొడి, రైతు భరోసా, ఆసరా, చేయూత, ఆటో వాలా.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాల ద్వారా జగన్ నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు.
ఈ పథకాల అమలు కోసం వేలకోట్లు అప్పు చేస్తున్నారు.దేశంలో అత్యధికంగా రుణభారం కలిగిన రాష్ట్రాల జాబితాలో ఆంద్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది.ఈ నేపథ్యంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం వైసీపీ ఓడిపోయిన. జగన్ ( CM jagan )ను ఎన్నో స్కామ్ లు చుట్టూ ముట్టడం ఖాయమని ప్రత్యర్థి నేతలు చెబుతున్నారు.

అమ్మవొడి స్కామ్ లో రూ.743 కోట్ల స్కామ్ జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము అధికారంలోకి వస్తే ఈ స్కామ్ లన్ని బయటకు తీస్తామని హెచ్చరించారు కూడా.దీంతో ఎన్నికల తరువాత జగన్ ( CM jagan )కు చిక్కులు తప్పవా అనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికే స్కామ్ లతో సతమతమౌతున్న టీడీపీ జగన్ ను దెబ్బ కొట్టేందుకు గట్టిగానే ప్రణాళికలు రచిస్తోంది.వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవిచూస్తే.అసలు జగన్ ను జైలుకే పరిమితం చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.అయితే వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయం అని జగన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మరి ఏం జరుగుతుందో చూడాలి.