టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో జబర్దస్త్ అవినాష్( Jabardasth Avinash ) ఒకరు కాగా అవినాష్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.బిడ్డ పుట్టకుండానే చనిపోవడంతో అవినాష్ భార్య సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
అవినాష్ భార్య అనూజ( Anuja ) ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో నా జీవితంలో సంతోషమైనా బాధ అయినా నా కుటుంబమైన మీతోనే పంచుకుంటానని ఆమె పేర్కొన్నారు.
కానీ తొలిసారి ఒక విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని అనూజ చెప్పుకొచ్చారు.
మేము అమ్మానాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురుచూశామని కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను( Baby ) కోల్పోయామని అనూజ పేర్కొన్నారు.ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిదని అంత త్వరగా మరిచిపోలేనిదని మీకు ఎప్పటికైనా చెప్పాలనే బాధ్యతతో ఈ విషయాన్ని పంచుకుంటున్నానని ఆమె కామెంట్లు చేశారు.
ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్స్ అని అనూజ చెప్పుకొచ్చారు.మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అలాగే దయచేసి ఈ విషయంలో ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని ఆమె కోరారు.మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అనూజ కామెంట్లు చేశారు.అనూజ చెప్పిన విషయాలు విని ఆమె అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు.
బిడ్డ పుట్టకుండానే మరణించడంతో అవినాష్ కుటుంబానికి( Avinash Family ) దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆ బాధ ఎలా ఉంటుందో మేము కూడా అనుభవించామని త్వరగా అవినాష్ ఫ్యామిలీ ఈ బాధ నుంచి కోలుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మధ్య కాలంలో అవినాష్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే షోలో పాల్గొన్నారు.అవినాష్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో కీలక పాత్రల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు.