టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
ఇకపోతే తాజాగా ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు తనలా ఎవరు మాట్లాడలేరని తన వాయిస్ ఎవరూ ఇమిటేట్ చేయలేరని వెల్లడించారు.
తాజాగా మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ కమెడీయన్ బుల్లెట్ భాస్కర్ స్పందిస్తూ తాను మహేష్ బాబు నటించిన ఒక సినిమాకి డబ్బింగ్ చెప్పానని షాకింగ్ కామెంట్ చేశారు.
సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 2014 వ ఈ సంవత్సరంలో వచ్చిన నేనొక్కడినే సినిమాకు ఈయన డబ్బింగ్ చెప్పినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని తన స్కిట్ లతో ఆకట్టుకొని సందడి చేసే బుల్లెట్ భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ తాను మహేష్ బాబు సినిమాలకు, తను యాడ్ కి తానే డబ్బింగ్ చెబుతానని చెప్పడమే కాకుండా అచ్చం మహేష్ బాబులాగా డైలాగ్స్ చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని అయితే ఇప్పటి వరకు ఆయనను కలిసే అవకాశం రాలేదని బుల్లెట్ భాస్కర్ తెలిపారు.సర్కారు వారి పాట సినిమా డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చినా అది కుదరలేదని బుల్లెట్ భాస్కర్ ఈ సందర్భంగా తెలిపారు.ఇక ఈయన కేవలం మహేష్ బాబు వాయిస్ మాత్రమే కాకుండా,ఎంఎస్ నాారయణ,కళ్లు చిదంబరం వంటి వారి వాయిస్ ను కూడా ఇమిటేట్ చేశారు.