యావత్ దేశానికే మార్గదర్శిగా నిలిచిన తెలంగాణ.వారి స్ఫూర్తితోనే అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన కేసీఆర్ .
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం యావత్ దేశానికే గర్వకారణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.సచివాలయం కు అంబేడ్కర్ గారి పేరు పెడతామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సమాజంలోని ప్రతీ ఒక్కర్నీ సమాన ద్రుష్టితో చూసిన, దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందలకోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికకే ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ చర్యతో వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు.
ఇదే స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం సైతం నూతన పార్లమెంటు భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు.