మల్లారెడ్డి కాలేజీల లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు.ఈ క్రమంలో హైదరాబాద్ బాలానగర్ రాజు కాలనీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
క్రాంతి బ్యాంక్ లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలను గుర్తించిన అధికారులు.బ్యాంక్ ఛైర్మన్ రాజేశ్వర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.
సుమారు ఏడు గంటలుగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజేశ్వర్ రెడ్డి నివాసాల్లోనూ ఐటీ దాడులు నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే కాలేజీ లావాదేవీల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ రైడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.