Bombay Movie : బొంబాయి సినిమాను నాగార్జున వదిలేసుకోవడానికి ఇదొక్కటే కారణమా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మణిరత్నం మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.

 Is This The Only Reason Why Nagarjuna Left Bombay-TeluguStop.com

నిజానికి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీసిన దర్శకుల్లో మణిరత్నం( Mani Ratnam ) మొదటి స్థానంలో ఉంటాడు.ఆయన షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాకుండా వరుస సక్సెస్ లను కూడా అందుకున్నాడు.

Telugu Arvind Swamy, Bombay, Mani Ratnam, Nagarjuna, Tollywood-Movie

ఇక తెలుగులో గీతాంజలి సినిమాతో నాగార్జున తో కూడా ఒక సినిమా చేసి సూపర్ హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన బొంబాయి సినిమాలో మొదటగా నాగార్జున( Nagarjuna ) నే హీరోగా తీసుకొని చేద్దామని అనుకున్నారట, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలోకి అరవింద స్వామిని తీసుకోవాల్సి వచ్చింది అంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి.నిజానికి ఆ సినిమా కొంచెం కాంట్రవర్సీతో కూడుకొని ఉంటుంది.కాబట్టి నాగార్జున కూడా అలాంటి సినిమా చేయడానికి ఇష్టపడలేదని అందువల్లే ఆ సినిమాను నాగార్జున వదిలేసుకోవాల్సి వచ్చిందంటు చాలా వార్తలు కూడా వచ్చాయి.

 Is This The Only Reason Why Nagarjuna Left Bombay-Bombay Movie : బొంబ�-TeluguStop.com
Telugu Arvind Swamy, Bombay, Mani Ratnam, Nagarjuna, Tollywood-Movie

ఇక దాంతో అరవింద స్వామి( Arvind Swamy ) తో సినిమా చేసి మణిరత్నం సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఆ సినిమాతో మణిరత్నం క్రేజ్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి.అయితే సినిమా రిలీజ్ సమయంలో మణిరత్నం మీద కొన్ని అటాక్ లు కూడా జరిగినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.ఇంకా అంతకుమించి బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది.

కానీ వాటికి లొంగకుండా మణిరత్నం సినిమా చేసి రిలీజ్ చేసి సక్సెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube