అక్కినేని నాగేశ్వర రావు …తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక మూల స్థంభం. ఎన్టీఆర్, అక్కినేని లాంటి మహానుభావుల కృషి ఫలితం ఈ రోజు తెలుగు సినిమా జాతి ఇలా వర్ధిల్లుతుంది.
లేకపోతే మద్రాసులో షూటింగ్స్ చేస్తూ ఇప్పటికి అక్కడే వారి దయ దాక్షణ్యాలతో బ్రతికే వాళ్లేమో.తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం మన స్టార్ హీరోలు అంత నడుం కట్టి ఇండస్ట్రీ ని ప్రభుత్వ సహాయంతో హైదరాబాద్ కి తరలించారు.
అయితే ఈ తరలింపు లో చాలా మంది హీరోలు ఉన్నారు.కొందరు తమ గురించి తమ డప్పు తామే కొట్టుకుంటారు.
మేము అది చేసాం.ఇది చేసాం.
అందుకే టాలీవుడ్ బాగా ఉంది అంటూ కబుర్లు చెప్తారు.
ఎవరి వంతు వారు ఇండస్ట్రీ కోసం కష్ట పడ్డ అది చెప్పుకోవడం మాత్రం అందరి వంతు.
అయితే అక్కినేని లాంటి హీరోలు మాత్రం అందుకు పూర్తిగా బిన్నం.అక్కినేని కి చాలా తక్కువగా ఇంటర్వ్యూ లు ఇచ్చే అలవాటు ఉండేది.అప్పట్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం కోసం రామ కృష్ణ పట్టు పట్టడం తో అక్కినేని ఇంటర్వ్యూ కోసం వచ్చారు.వచ్చి రాగానే ఇంటర్వ్యూ లో మొదటి ప్రశ్నగా తెలుగు సినిమాను మద్రాసు నుంచి హైదరాబాద్ రప్పించి నిలబెట్టిన మూలస్తంభాల్లో మీరు ఒకరు అంటూ ఎదో చెప్పబోతే అక్కినేని ఆ విషయాన్నీ కాదు అంటూ వారించాడు.
తాను హైదరాబాద్ కి వచ్చిన మాట వాస్తవమే కానీ నేను మూలస్థంభాన్ని అంటే ఒప్పుకొని అని చెప్పాడు.
![Telugu Akkineni, Akkinenimind, Gummadi, Jaggaya, Rama Krishna, Sv Ranga Rao, Tol Telugu Akkineni, Akkinenimind, Gummadi, Jaggaya, Rama Krishna, Sv Ranga Rao, Tol]( https://telugustop.com/wp-content/uploads/2022/11/Akkineni-Nageswara-Rao-Rama-Krishna.jpg)
తాను మూలస్థంభం అయితే తన కన్నా సీనియర్లు ఎస్ వి రంగారావు, జగ్గయ్య, గుమ్మడి వంటి వారు మాములు వ్యక్తులు ఎలా అవుతారు.అందరం కలిసే సినిమాను ఇక్కడ నిలబెట్టాం.నా ఒక్కరి వల్ల ఏమి కాలేదు.
నేను ఎన్టీఆర్ మొదలు పెట్టాం కానీ ప్రతి ఒక్కరు మద్రాసు లో ఉన్న తమ ఆస్తులను వదిలేసుకొని వచ్చారు.రాలేని వారు అక్కడే ఉన్నారు.
వచ్చేప్పుడు ఎంత తక్కువ మొత్తం లో ఇచ్చిన సరే తెగనమ్ముకుని వచ్చిన నటులు కూడా ఉన్నారు అంటూ అక్కినేని చెప్పడం తో నోరెళ్లబెట్టడం ఆర్కే వంతయ్యింది.మరి అక్కినేని ని అంత ఈజీ గా గెలవడం ఆర్కే వల్ల అయ్యే పని కాదు కదా !
.