ప్రపంచ వింతల్లో ఒక వింతగా పేరుగాంచిన అత్యంత సుందరమైన నిర్మాణం తాజ్ మహల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తాజాగా ఈ నిర్మాణం ఆవరణలో ఓ వ్యక్తి నమాజు చేశాడు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది.
ఈ వ్యవహారంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పందిస్తూ నమాజుకి అనుమతి లేదని క్లారిఫికేషన్ అందించింది.
నిబంధనల ప్రకారం, ప్రతి శుక్రవారం తాజ్ మహల్ సమీపంలో ఉన్న ఓ మసీదు వద్ద నమాజు చేసుకోవచ్చు.
కానీ తాజ్ మహల్ ఆవరణలో ఇది చేయడం నిషిద్ధం.ఇక తాజ్‌మహల్ ఆవరణలో చుట్టుపక్కల ఉన్న కొద్దిమందికి మాత్రమే పాస్ లు అందజేస్తారు.వారు మాత్రమే శుక్రవారం అక్కడ నమాజు చేస్తారు.మిగతా రోజుల్లో తాజ్ మహల్ ఆవరణలో నమాజు చేయకూడదు.
శుక్రవారం ఒక్కరోజే తాజ్ మహల్ మూసి ఉంటుంది.ఆ సమయంలో దగ్గరిలో ఉన్న ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి తాజ్ మహల్ ఆవరణలోకి వెళ్లొచ్చు.
ఇదిలా ఉండగా తాజ్ మహల్‌లో నమాజు చేయడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి .రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదా తమకు కూడా తాజ్ మహల్‌లో పూజలు నిర్వహించడానికి తగిన అనుమతులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి.అంతేకాదు, హిందూ సంఘాల నేతలు ఈ సుందరమైన నిర్మాణం అసలు పేరు తాజ్ మహల్ కాదని, తేజో మహాలయ అని వాదనలు చేస్తున్నారు.ఇదొక శివుడి గుడి అని వ్యాఖ్యలు చేస్తున్నారు స్థానిక హిందూ సంఘం నేతలు.
ఈ నేపథ్యంలో అధికారులు ఈ వ్యవహారంపై వేగంగా విచారణ జరుపుతున్నారు.