తెలంగా రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు.కాంగ్రెస్ పార్టీకి ఆయన పక్కలో బళ్లెంలా మారారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి ఎపిసోడ్ తలనొప్పిలా తయారైంది.అయితే కోమటిరెడ్డి పార్టీ మారితే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది.
అటు తాను రాజీనామా చేస్తే తన గెలుపుపై అపనమ్మకం ఉండటంతో రాజగోపాల్‌రెడ్డి మీమాంసలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.కాసేపు రాజీనామా చేసి బీజేపీలో చేరతానని.
కాసేపు కాంగ్రెస్ పార్టీలో మంచి పదవి ఇస్తే ఉంటానని చెప్తూ తన లక్ష్యం ఏంటో తెలియక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయోమయానికి గురవుతున్నారు.అయితే ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయనకు కార్యకర్తలు సూచిస్తున్నారు.
అంతేకాకుండా ఉప ఎన్నిక వస్తే మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తాయని.అభివృద్ధి జరుగుతుందని ప్రజలను రాజగోపాల్‌రెడ్డి మభ్యపెడుతున్నారు.
మరోవైపు ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తే బీజేపీ అభాసుపాలవుతుందని.మరో ఏడాదిన్నరలో ఎన్నికల ముందు ఇది అవసరమా అని ఆలోచన చేస్తున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి ఇస్తామని చెబితే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాలన్నఆలోచనను విరమించుకుని ఆ పార్టీలోనే కొనసాగుతారా.ఆ పార్టీ గెలుపునకు కృషి చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.అప్పుడు టీఆర్ఎస్‌ను ఢీకొట్టేది బీజేపీనే అని గతంలో కోమటిరెడ్డి చేసిన వాదన ఎటు పోతుందని మరికొందరు నిలదీస్తున్నారు.మొత్తానికి రాజీనామా చేసేందుకు కోమటిరెడ్డి భయపడుతున్న సూచనలు అయతే కనిపిస్తున్నాయి.
అటు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారితే ఆయనపై బహిష్కరణ వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీని మరింత బలహీనం చేసే అవకాశం కూడా లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.