బీజేపీ సింగిల్ గా వెళ్తే నష్టమేనా ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో పొత్తు వ్యవహారాలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ( Congress party ) వామపక్షాలతో పొత్తు కోసం అరతపడుతోంది.

 Is It A Loss If Bjp Goes Single , Bjp Party , Brs Party , Tdp Party , Congress-TeluguStop.com

అటు కమ్యూనిస్ట్ పార్టీలు సైతం హస్తంతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.ఇప్పటికే పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటు కూడా జరిగినట్లు టాక్.

అటు అధికార బి‌ఆర్‌ఎస్( BRS party ) మళ్ళీ ఏంఐఏంతో పొత్తు కన్ఫర్మ్ అని ఇప్పటికే తేల్చి చెప్పింది.దీంతో ఇప్పుడు పొత్తు విషయంలో బీజేపీ వైఖరి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో కలవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు.

Telugu Brs, Congress, Kishan Reddy, Chandrababu-Latest News - Telugu

వామపక్షాలు మొదటి నుంచి కూడా బీజేపీని విభేదిస్తూనే ఉన్నాయి.ఇక ఇటు ఏంఐఏం అసలు కాషాయ పార్టీతో కలిసే ప్రసక్తే లేదు.ఇక మిగిలిందల్లా టీడీపీనే.ఈసారి తెలంగాణలో కూడా గట్టిగా సత్తా చాటలని చూస్తున్న టీడీపీ 119 స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది.దీంతో టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదనేది స్పష్టమైంది.అయితే ఈ మద్య బీజేపీ అధిష్టానంతో టీడీపీ అధినేత చంద్రబాబు( N.Chandrababu Naidu ) వరుసగా భేటీ అవుతుడడంతో ఈ రెండు పార్టీల మద్య పొత్తు అంశం మరోసారి చర్చకు వస్తోంది.

Telugu Brs, Congress, Kishan Reddy, Chandrababu-Latest News - Telugu

అయితే ఏపీలో ఈ రెండు పార్టీల మద్య పొత్తు దొబుచులాడుతుంటే తెలంగాణలో ఈ రెండు పార్టీలు కలుస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.ఇటీవల అధినేత చంద్రబాబు కూడా దీనిపై స్పందిస్తూ తెలంగాణలో బీజేపీతో పొత్తు ఆలస్యమైందని, పొత్తు లేకుండా బరిలోకి దిగుతామని చెప్పుకొచ్చారు.దీంతో అటు బీజేపీ కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) తాజాగా స్పష్టం చేశారు.దీంతో తెలంగాణలో ప్రధాన పార్టీలుగా ఉన్న బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పొత్తులతో బరిలోకి దిగుతుంటే బీజేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది.

మరి బీజేపీ ఒంటరి పోరు ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube