మెగా ఫ్యామిలీ లో పెళ్లి వేడుక జరుగబోతుంది.మెగా కుటుంబం ఇప్పుడు చాలా పెద్దగా మారింది.
కనుక ఎప్పుడూ కూడా ఏదో ఒక వేడుక ఉంటూనే ఉంది.ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్( Varun Tej ) పెళ్లి వేడుక జరుగబోతుంది.
వరుణ్ తేజ్ సుదీర్ఘ కాలంగా ప్రేమిస్తున్న లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసేందుకు సిద్ధం అయ్యాడు.

నవంబర్ 1 న భారీ ఎత్తున ఇటలీ( Italy ) లో ఈ వివాహ వేడుక జరుగబోతుంది.ఒకటి లేదా రెండు రోజుల్లో పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలు అవ్వబోతుంది.అంతా కూడా అక్టోబర్ 30 వ తారీకున ఇటలీ చేరకోవాల్సి ఉంటుందట.
ఇప్పటికే వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి ఇంకా ముఖ్య కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు.ఇప్పుడు మెగా ఫ్యామిలీ కి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ లు ఈ పెళ్లి వేడుక కోసం ఇటలీ వెళ్తారా అనేది ఆసక్తిగా మారింది.
చిరంజీవి అనారోగ్య కారణాల వల్ల ఇటలీ వెళ్లే విషయమై అనుమానాలు నెలకొన్నాయి.

ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan )రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం.అందుకే పవన్ కళ్యాణ్ ను ఈ పెళ్లి లో చూడటం సాధ్యం కాదు అంటున్నారు.ఇక రామ్ చరణ్ తన కూతురు క్లింకార తో ఈ పెళ్లి వేడుక కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
ఉపాసనతో మరియు కూతురు తో కలిసి రామ్ చరణ్ ఏ సమయం లో అయినా ఇటలీ ఫ్లైట్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి.పెదనాన్న మరియు చిన్నాన పెళ్లికి హాజరు కాకుంటే నాగ బాబు ఎలా ఫీల్ అవుతాడో అంటూ కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొందరు మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా కచ్చితంగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు సతీ సమేతంగా పిల్లలతో కలిసి ఇటలీ వెళ్తారు అంటున్నారు.మరి ఏం జరుగబోతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.