బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రతియేడాది నిర్వహించే ఐపిఎల్ ఈసారి కరోనా కారణంగా యూఏఈకి షిఫ్ట్ అయింది.ఈ నెలలో మొదలు కానున్న ఐపీఎల్ ఆడడం కోసం ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్ తో కలిసి యూఏఈ చేరుకున్నాయి.కోవిడ్-19 విషయంలో ప్లేయర్స్ కు రక్షణ కల్పించేందుకు ఒక్కొక్క ఫ్రాంచైజీ ఒక హోటల్ ను తీసుకున్నది.త్వరలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలవనున్న ఆ జట్టు సభ్యుడు కేన్ మామా అదేనండి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను మన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ముద్దుగా అలానే పిలుస్తారు.
ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో ఆయన ఐపీఎల్ లో ఆడే ఆరుగురు కివీస్ ఆటగాళ్లలో అతనొకడిని కరోనా టైంలో ఈ మహమ్మారి బారిన పడ్డారనే వార్త వినాలని అనుకోవట్లేదని త్వరలో ఈ కరోనా కోరలలో చిక్కిన వారంతా పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కరోనా టైంలో ఐపీఎల్ ఆడటానికి తాను ప్రెషర్ తీసుకుంటున్నట్లు కేన్ అభిప్రాయపడ్డారు.ఐపీఎల్ ఈ టైంలో నిర్వహించడం అవసరమా అని గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ను ప్రశ్నిస్తుంది.
అప్పట్లో ఈ విషయాన్ని లైట్ తీసుకున్న బీసీసీఐ.ప్రస్తుతం కేన్ లాంటి వారి ఆందోళనను పోగొట్టడానికి ఇంకెన్ని చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి
.