బీసీసీఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపిఎల్ ఈసారి యూఏఈ వేదికగా జరగనున్నది.దీనిని నిర్వహించే కార్యక్రమాలలో ప్రస్తుతం భారత బోర్డు బాగా బిజీగా ఉంది.
క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఈ లీగ్ స్టార్ట్ అవ్వడం కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.అయితే ఈ లీగ్ హిస్టరీలో అతిఎక్కువ సార్లు కప్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం కరోనా దెబ్బ విలవిలలాడుతుంది.
ఇప్పటికే ఈ జట్టులో ఇద్దరు క్రికెటర్లు మరియు ఇతర సహాయ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని ప్రచారం జరుగుతుంది.బీసీసీఐ కూడా ఐపీఎల్ లో ఆడబోతున్న కొంత మంది ఆటగాళ్లకు అలాగే సపోర్టింగ్ స్టాఫ్ కు కరోనా వచ్చిందని నిర్ధారించింది కానీ ఆ టీం అలాగే ఆ ప్లేయర్స్ వివరాలు బహిర్గతం చేయలేదు.
దానితో కరోనా బారిన పడింది, చెన్నై టీం వాళ్ళనే ప్రచారం మరింత జోరుగా సాగుతుంది.
ఇక తన తల్లి ఆరోగ్యరీత్యా దుబాయ్ కి టీంతో వెళ్ళని బజ్జీ ఈసారి ఐపీఎల్ ఆడటానికి సుముఖత చూపట్లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.
దీనికి కారణం చెన్నై టీం కరోనా బారిన పడింది అన్న ప్రచారం ఒకపక్క, మరోపక్క సురేష్ రైనా తిరిగి ఇంటిముఖం పట్టడం వంటి అంశాలని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.