మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ పిటిషన్ పై విచారణ జరిగింది.హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది.
ఈ క్రమంలో ఎర్ర గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ వాదనలు వినిపించింది.మరోవైపు బెయిల్ ను రద్దు చేసేందుకు బలమైన కారణాలు ఏమీ లేవని ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.