Kamal Haasan Sobhan Babu: కమల్ హాసన్ ని పట్టుకొని తెగ ఏడ్చేసిన శోభన్ బాబు.. ఎందుకో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో మామూలుగా ఒక హీరోతో అనుకున్న సినిమాను మరొక హీరోతో తీయడం అనుకోకుండానే రాత్రికి రాత్రి దర్శక నిర్మాతలు లేదంటే నటీనటులు సాంకేతిక నిప్పులు మారిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.హీరో హీరోయిన్లు రిజెక్ట్ చేసిన సినిమాలను వేరే హీరో హీరోయిన్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 Interesting Incident Between Sobhan Babu And Kamal Haasan-TeluguStop.com

ఇప్పట్లో సోషల్ మీడియాలో బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి చిన్న విషయం వెంటనే తెలిసిపోతోంది.కానీ అప్పట్లో ఏం జరుగుతుంది అన్న విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించేవారు.

అటువంటి సమయంలోనే విశ్వ నటుడు కమల్ హాసన్( Kamal Haasan ) అలాగే శోభన్ బాబు( Sobhan Babu ) మధ్య జరిగిన ఒక ఊహించని సంఘటన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.తాను చేయాల్సిన కథతో కమల్ సినిమా చేసి సంచలన విజయం సాధించడంతో శోభన్ బాబు షాక్ అయ్యారట.

అప్పట్లో ఇద్దరు కథానాయికలు, కుటుంబ కథా చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్‌గా మారారు.వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేవారు.డేట్స్ ఖాళీ లేక చాలా చిత్రాలు వదులుకున్నారట.ఆయనకు కథలు కూడా ఒక పట్టాన నచ్చేవి కావట.

వాటిలో మొదట వద్దనుకుని, తర్వాత ఫీల్ అయిన సినిమాలలో ఆకలిరాజ్యం( Akali Rajyam Movie ) కూడా ఒకటి.

Telugu Aakali Rajyam, Balachander, Kamal Haasan, Kamalhasan, Shoban Babu, Sobhan

కమల్ హీరోగా దర్శకుడు కె.బాల చందర్ తెరకెక్కించిన చిత్రంలో అయితే మొదట శోభన్ బాబుని హీరోగా అనుకున్నారట.కథ రెడీ అయి రెండు, మూడు సిట్టింగ్స్ కూడా జరిగాయట.

కానీ సీన్ కట్ చేస్తే శోభన్ బాబుకి ముందు నుండీ హీరో పాత్ర విషయంలో కొన్ని సందేహాలు ఉండడంతో కొన్ని మార్పులు చేర్పులు చెప్పగా అందుకు దర్శకుడు ఒప్పుకోలేదట.జీవితంలో రాజీ పడని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద, నిరుద్యోగ యువకుడిగా కనిపించే హీరో, అతనికి ఎదురయ్యే సమస్యలు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ బాగానే ఉన్నా కథానాయకుడు ఎమ్ఏ ఫిలాసఫీ చదివి సెలూన్‌లో పనిచేయడం అనేది శోభన్ బాబుకి నచ్చలేదు.

అతను చేయడానికి ఇంకే పనులు లేవా? మార్చండి అని చెప్పగా అందుకు ససేమిరా అన్న దర్శకుడు కథలో హీరో వృత్తికి బదులు హీరో పాత్ర ధారినే మార్చేశారు.

Telugu Aakali Rajyam, Balachander, Kamal Haasan, Kamalhasan, Shoban Babu, Sobhan

దాంతో శోభన్ బాబు స్థానంలో కమల్ హాసన్‌ని తీసుకున్నారు.విడుదలైన తర్వాత ఊహించిన దానికంటే ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.పాటలైతే మార్మోగిపోయాయి.100 రోజుల వేడుకకు శోభన్ బాబుని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి స్వయంగా కమల్ ఆయన ఇంటికి వెళ్లారట.సినిమా ఇంత బాగా వస్తుందని తాను ఊహించలేదని అద్భుతంగా నటించావంటూ కమల్‌ని హత్తుకుని, భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారట.

ఆ సినిమా వదులుకున్నందుకు ఎంతో బాధపడ్డారట శోభన్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube