విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో నువ్వునాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి.వెంకటేష్ కు జోడీగా ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించగా విజయభాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది.
అయితే ఈ సినిమా రిలీజ్ రోజున సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది.
కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా థియేటర్లలో రెండు మూడు వారాల కంటే ఆడటం కష్టమని అన్నారు.అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.
వెంకటేష్ ఈ సినిమాకు రెండున్నర కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
7 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.64 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.మొదట త్రివిక్రమ్ రాసిన కథ ప్రకారం కథ మొత్తం ఇంట్లోనే జరుగుతుంది.
అయితే సినిమా అలా ఉంటే ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఔట్ డోర్ లో కూడా కొన్ని సీన్లు ఉండేలా ప్లాన్ చేయాలని సురేష్ బాబు త్రివిక్రమ్ కు సూచనలు చేశారు.
ఈ సినిమా సమయంలో ప్రకాష్ రాజ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బ్యాన్ విధించింది.
అందువల్ల ప్రకాష్ రాజ్ సీన్లను పెండింగ్ లో పెట్టి బ్యాన్ తొలగించిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ను జరిపారు.నిషేధం తొలగించిన తర్వాత కేవలం 17 రోజులలో నువ్వు నాకు నచ్చావ్ లో ప్రకాష్ రాజ్ సీన్ల షూటింగ్ ను పూర్తి చేశారు.
ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ మూవీ ఒకటి కావడం గమనార్హం.