వివాదాన్ని ముగించిన శ్రావణ భార్గవి.. వీడియోకు మ్యూజిక్ మార్చి?

శ్రావణ భార్గవి.ఈమె పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది.

 Singer Sravana Bahrgavi Deletes Oka Pari Song Music,oka Pari Song, Sravana Bharg-TeluguStop.com

ఈమె అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేసిందని, అన్నమయ్య కీర్తనలను తన అందాన్ని అభివర్ణించడం కోసం ఉపయోగించింది అంటూ ఆమెపై అటు అన్నమయ్య కుటుంబ సభ్యులు, అలాగే టీటీడీ సిబ్బంది ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయింది.

కాగా ఈ వివాదం విషయంలో కొంతమంది ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయగా మరి కొంతమంది ఆమెకు మద్దతుగా కూడా మాట్లాడారు.
ఇదే విషయంపై అన్నమాచార్యుల పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ భక్తభావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి అపహాస్యం చేసింది అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రావణ భార్గవి ఈ వివాదానికి ముగింపు పలికింది.ఆమె రూపొందించిన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే కీర్తనను ఆమె ఎట్టకేలకు తొలగించింది.

ఈ సందర్భంగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చింది.నా యూట్యూబ్ ఛానల్ అభిమానులకు సంతోషాన్ని,ఉత్సాహాన్ని తీసుకొస్తుంది.

నేను ఎప్పుడూ కూడా తెలిసి తెలిసి వివాదాలు కొనితెచ్చుకోను.

అలాగే నా సోషల్ మీడియా వేదికగా నెగిటివిటీని అస్సలు ప్రోత్సహించెను అని ఆమె తెలిపింది.నేను కూడా అదే పంథాను అనుసరిస్తా.అన్నమాచార్య గారి మీద ఉన్న అపార గౌరవం, ఆరాధనతో ఇటీవలే చేసిన వీడియో లోని ఆడియో తొలగిస్తున్నాను.

ఇప్పటికీ నేను చెప్పేది ఏమిటంటే.నేను ఆ వీడియో చేయడం వెనుక ఎన్నో గంటల సమయం,శ్రమ ఉన్నాయి.

అదొక అందమైన కళాఖండం అని నేను నమ్ముతున్నాను అని తెలిపింది శ్రావణ భార్గవి.నేను తొలగించిన ఆ వీడియో మరొక ఆడియోతో నా ఛానల్ లో కొనసాగుతుంది.

అలాగే చివరగా ఎప్పుడైతే మీరు చూసే తీరు మారుతుందో అప్పుడే మార్పును కూడా చూడగలర.దృష్టి కోణం ప్రతి విషయంలోనూ ఉంది అంటూ శ్రావణి భార్గవి ట్వీట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube